మిస్ యునివర్స్ హర్నాజ్ కౌర్ సంధు FDCI లాక్మే ఫ్యాషన్ వీక్-2022లో తళుక్కున మెరిసింది. డిజైనర్ ద్వయం శివన్ & నరేష్ కోసం షోస్టాపంగా మారింది. స్వీపింగ్ గౌనులో రన్‌వేపైకి దూసుకెళ్లింది. రెడ్ కలర్ గౌన్ లో హర్నాజ్ మెరిసిపోయింది. అయితే గత ఏడాది మిస్ యునివర్స్ గా నిలిచిన ఈ బ్యూటీ కాస్త ఒళ్లు చేసింది. మొహంలో కూడా ఉబ్బింది. బాడీ షేప్ లో కొట్టొచ్చినట్టు మార్పు కనిపిస్తుంది. దీంతో ఆమెపై నెటిజన్స్ బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తున్నారు. మిస్ యునివర్స్-2021 విజేతగా నిలిచింది హర్నాజ్ కౌర్ సంధు. పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్ ప్రాంతానికి చెందిన ఈ 21 ఏళ్ల చిన్నది.. 21 సంవత్సరాల తర్వాత భారత్ కు విశ్వసుందరి కిరీటాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. 80 దేశాల నుంచి వచ్చిన అందగత్తెలను వెనక్కి నెట్టి కిరీటాన్ని కైవసం చేసుకుంది. గతంలో ఈ ఘనతను సాధించిన సుస్మితా సేన్ (1994), లారా దత్తా (2000)ల సరసన చేరింది. అయితే మిస్ యూనివర్స్ కిరీటం గెలిచి.. ఆర్నెళ్లు కూడా కాకముందే.. ఈ ముద్దుగుమ్మ లావెక్కడం హాట్ టాపిక్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa