ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ దేవరకొండ కీలక ప్రకటన

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 28, 2022, 01:44 PM
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాపై కీలక ప్రకటన చేశాడు. లైగర్ సినిమా దర్శకుడైన పూరి జగన్నాథ్ తోనే తన నెక్స్ట్ సినిమాను చేయనున్నాడు. ఈ సినిమాను ఈ నెల 29న లాంచ్ చేయనున్నట్లు ప్రకటించాడు. పూరి జగన్నాథ్​ తన కలల ప్రాజెక్టు 'జనగణమన'ను మహేష్ బాబుతో తీయాలనుకుంటున్నట్లు గతంలో ప్రకటించాడు. కానీ అది కుదరకపోవడంతో ఇప్పుడు విజయ్ దేవరకొండతోనే తెరకెక్కించనున్నాడు. ఇప్పటికే విజయ్​తో కలిసి పూరి 'లైగర్'​ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa