ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఘనీ' ప్రీరిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్ గా అల్లుఅర్జున్?

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 29, 2022, 11:04 AM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రాబోయే ప్రాజెక్ట్స్ లో ఒకటైన "ఘని" మూవీ త్వరలో రిలీజ్ కి సిద్ధంగా ఉంది.కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమాలో వరుణ్ సరసన సాయి మంజ్రేకర నటిస్తోంది.సీనియర్ నటులు ఉపేంద్ర,సునీల్ శెట్టి, జగపతి బాబు,నదియా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.సినిమా టీజర్ భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసి సినిమాపై అంచనాలను పెంచిందని చెప్పొచ్చు.తాజా రిపోర్ట్స్ ప్రకారం,'ఘనీ' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఏప్రిల్ 2,2022న వైజాగ్‌లో ఈ ఈవెంట్ గ్రాండ్‌గా జరగనుందని లేటెస్ట్ టాక్.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మేకర్స్ నుండి రావాల్సి ఉంది.రెనైసన్స్ పిక్చర్స్ అండ్ అల్లు బాబీ కంపెనీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa