త్వరలో 19వ ‘ఐఫా’ (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ) వేడుక ప్రారంభం కాబోతోంది. ఈ వేడుకలో లెజెండరీ నటి రేఖ 20ఏళ్ల తర్వాత అభిమానుల కోసం నృత్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ముంబయిలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నటుడు వరుణ్ ధావన్ తెలియజేశాడు. చిన్నప్పటి రేఖ సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు లైవ్‌లో ఆమె ప్రదర్శన చూడబోతున్నందుకు ఎగ్జైటింగ్‌గా ఉంది. ఈ కార్యక్రమంలో రేఖ ప్రదర్శనే హైలైట్‌గా నిలుస్తుంది. అని పేర్కొన్నారు. అయితే ఏ పాటకు ప్రదర్శన ఇవ్వబోతున్నారు అని మీడియా ప్రతినిధులు రేఖను అడగ్గా..నాకు రేఖతో పాటు మిస్టరీ అనే రెండో పేరు కూడా ఉంది. అంటే నేనేం చేయబోతున్నానో ముందే చెప్పను. అన్నీ ఇప్పుడే చెప్పేస్తే ఇక కిక్ ఏముంటుందని అన్నాడు. ఈ ఐఫా వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, రితేశ్ దేశ్‌ముఖ్ హోస్ట్ చేయనున్నారు. ఈ ఐఫా వేడుక బ్యాంకాక్‌లోని సియామ్ నిమ్రత్ థియేటర్‌లో ఈ నెల 22 నుంచి 24వరకు జరగబోతోంది. బాలీవుడ్‌కు చెందిన అతిరథ మహారథులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa