మాస్ ఫాలోయింగ్ ఉన్న నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన కల్యాణ్ రామ్ ఇన్నాళ్లు అదే ఇమేజ్‌ను కంటిన్యూ చేస్తూ సినిమాలు చేస్తూ వచ్చాడు. కెరీర్‌లో పెద్దగా సక్సెస్‌లు లేకపోయినా వరుస సినిమాలతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే తొలిసారిగా తన ఇమేజ్‌ను పక్కన పెట్టి పూర్తి క్లాస్ మూవీగా తెరకెక్కిన నా నువ్వేతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కల్యాణ్ రామ్. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన నా నువ్వే అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుంది..? మాస్ ఇమేజ్ ను పక్కన పెట్టి కల్యాణ్ రామ్ చేసిన ప్రయోగం ఏ మేరకు ఫలించింది..?
కథ ; నా నువ్వే డెస్టినీని నమ్మే అమ్మాయి.. నమ్మని అబ్బాయిల ప్రేమకథ. వరుణ్ (కల్యాణ్ రామ్) పెద్దగా నమ్మకాలు లేని మోడ్రన్ కుర్రాడు. అమెరికాలో ఉద్యోగం రావటంతో ఫ్రెండ్స్‌ని, బామ్మని వదిలేసి అమెరికా ప్రయాణం అవుతాడు. కానీ ఏవేవో కారణాల వల్ల మూడు సార్లు వరుణ్ ప్రయాణం క్యాన్సిల్ అవుతుంది. మీరా (తమన్నా) డెస్టినీని విపరీతంగా నమ్మె అమ్మాయి. అనుకోకుండా తన దగ్గరకు వచ్చిన బుక్ లో వరుణ్ ఫొటో చూసి ఇంప్రెస్ అవుతుంది. ఆ ఫొటో చూసినప్పుడలా తనకు లక్ కలిసి వస్తుండటంతో ఫొటో చూసే వరుణ్‌తో ప్రేమలో పడుతుంది. ఎలాగైన వరుణ్‌కు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంది. అనుకున్నట్టుగానే వరుణ్ కలిసి తన ప్రేమ గురించి చెపుతుంది. అయితే మీరా నమ్మే డెస్టినీకి ఓ టెస్ట్ పెట్టిన వరుణ్ చివరకు మీరాతో ప్రేమలో పడతాడు. మీరా తండ్రి (తనికెళ్ల భరణి) వారి ప్రేమకు అడ్డు చెప్తాడు. అనుకోని పరిస్థితుల్లో వరుణ్, మీరాకు దూరమవుతాడు. వరుణ్‌ను తిరిగి కలుసుకునేందుకు మీరా ఏం చేసింది..? వరుణ్, మీరాలు ఎందుకు దూరమయ్యారు..? చివరకు ఎలా కలిశారు..? అన్నదే మిగతా కథ.
నటీనటులు ; ఇన్నాళ్లు మాస్ యాక్షన్ రోల్స్ లో కనిపించి కల్యాణ్ రామ్ సాఫ్ట్, స్టైలిష్ లుక్ లో మెప్పించాడు. నటన పరంగానూ ఆకట్టుకున్నాడు. మీరా పాత్రలో తమన్నా ఒదిగిపోయింది. గ్లామర్ షోతో కుర్రకారును ఫిదా చేసిన తమన్నా నటనలోనూ ఫుల్ మార్క్స్ సాధించింది. రొమాంటిక్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సీన్స్‌లోనూ తమన్నా నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. పోసాని కృష్ణమురళీ తెర మీద కనిపించింది తక్కువ సేపే అయిన ఉన్నంతలో తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వించారు. హీరోయిన్ తండ్రి తనికెళ్ల భరణీ తనకు అలవాటైన రొటీన్ పాత్రలో కనిపించారు. ప్రవీణ్, వెన్నెల కిశోర్, సురేఖ వాణి, ప్రియదర్శి తమ పాత్రలకు న్యాయం చేశారు.
రివ్యూ : 2.5/5
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa