ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ దావన్తో కలిసి అరబిక్ కుతూ పాటకు స్టెప్పులేసి అదరగొట్టింది రష్మిక. ఈ అమ్మడు ఇప్పుడు ఫుల్ జోష్ మీదుంది. ఇటీవల పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. మరోవైపు బాలీవుడ్లోనూ సత్తా చాటుతోంది. బీటౌన్లో వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీ బిజీగా గడిపేస్తుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో పుష్ప పార్ట్ 2, తమిళంలో కార్తీ సరసన ఓ ప్రాజెక్ట్.. బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు చిత్రాలు ఉన్నాయి. షూటింగ్ దశలో ఉన్న హిందీ చిత్రాలు త్వరలోనే పూర్తి కానున్నాయి. తాజాగా రష్మికకు సంబంధించిన జిమ్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa