ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్‌తరుణ్‌ సరసన నాలుగోసారి ..

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 14, 2018, 04:10 PM

గతంలో మాదిరిగా హెబ్బాపటేల్‌ కెరీర్‌ ఇప్పుడంత జోరుగా లేదు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషలలో కూడా చిత్రాలు చేసిన ఆమెకు టాలీవుడ్‌లో మొన్నటివరకు మంచి క్రేజ్‌ ఉండేది. అయితే వరుస అపజయాలతో ఆమెకు సినిమాలే సన్నగిల్లాయి. అలా ఎలా చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ భామకు కుమారి 21 ఎఫ్‌ చిత్రం ఎనలేని గుర్తింపునిచ్చింది. దాంతో వరుస అవకాశాలు తలుపుతట్టాయి. ఆ తర్వాత నటించిన ఈడోరకం…ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడ విజయాలను సాధించడంతో ఆమెకు హ్యాట్రిక్‌ లభించింది. అయితే ఆ తర్వాత నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్‌, మిస్టర్‌, అందగాడు వంటి చిత్రాలు అనుకున్నంతగా ఆడకపోవడం ఆమెను నిరాశకు గురిచేశాయి. గతేడాది నటించిన ఏంజెల్‌ చిత్రం తర్వాత నుంచి ఇప్పటివరకు అవకాశాలేమీ ఆమె దరిచేర లేదు. అయితే తాజాగా వినిపిస్తున్న సమచారం ప్రకారం రాజ్‌తరుణ్‌ సరసన నాలుగోసారి ఆమె నటించబోతున్నట్లు తెలిసింది. వీరిద్దరూ జోడీగా గతంలో కుమారి 21 ఎఫ్‌, ఈడోరకం..ఆడోరకం, అందగాడు చిత్రాలొచ్చాయి. వాటిలో అందగాడు మినహా మిగతా రెండు చిత్రాలు విజయం సాధించిన విషయం వేరుగా చెప్పనక్కరలేదు. ఆ కారణంగానే ఈ జోడీకి మంచి క్రేజ్‌ ఉంది. మరోవైపు రాజ్‌తరుణ్‌కు కూడా కొంతకాలంగా హిట్లు లేకపోవడంతో అతను తమిళంలో విజయవంతమైన ఓ రీమేక్‌ చిత్రాన్ని నమ్ముకున్నారట. విజయ్‌సేతుపతి, నయనతార నటించిన నానుమ్‌ రౌడీదాన్‌ సినిమాను తెలుగులో రాజ్‌తరుణ్‌ హీరోగా రీమేక్‌ చేయనున్నట్లు, సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిసింది. ఇందులో రాజ్‌తరుణ్‌ సరసన హెబ్బాపటేల్‌ నటించనున్నట్లు చెబుతున్నారు. ఈ చిత్రంతోనైనా ఆమె కెరీర్‌ మరోసారి మలుపు తిరుగుతుందేమో వేచిచూడాల్సిందే.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa