ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీచ్ ఒడ్డున హాట్ బ్యూటీ అనసూయ

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 16, 2018, 09:17 AM

జబర్దస్త్ కామెడీ షోతో వెలుగులోకి వచ్చిన హాట్ బ్యూటీ అనసూయ. తెలుగులో యాంకరింగ్ కు ఓ గ్లామర్ లుక్ తెచ్చిన ఘనత ఈ సుందరికే దక్కుతుంది. జబర్దస్త్ తో వచ్చిన గుర్తింపుతో ఇప్పుడు సినిమాల్లోనూ అడుగుపెట్టింది. పెళ్లయినా కూడా గ్లామర్ ను చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తున్న అనసూయ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలతో అభిమానులకు షాకిస్తుంటుంది. 


తాజాగా అనసూయ తన ఇన్ స్టాగ్రామ్ లో బీచ్ ఒడ్డున దిగిన ఓ ఫొటో షేర్ చేసింది. ఇసుకలో మోకాళ్లపై నుంచి సముద్రపు అలలను చూస్తూ ఉన్న ఫొటో కుర్రాళ్ల గుండెల్లో బాణమై దిగుతుంది. మిడిల్ ఏజ్ లో బ్యూటీని ఇంత ఇంప్రెసివ్ గా చూపించడం అనసూయకే చెల్లింది. ఈ సందర్భంగా అనసూయ గతజన్మ జ్ఞాపకాలు ఏవో గుర్తు వచ్చేసినట్టున్నాయి. ‘‘నేను గతజన్మలో మత్స్య కన్యని అయిన ఉంటానని అనిపిస్తోంది. కానీ ఒక్క క్షణం. మత్స్య కన్యలకు మరణం అనేది ఉండదని అంటారుగా.. నేనూ అంతేనా’’ అంటూ కాస్త కవితాత్మకత కూడా తన కామెంట్ లో యాడ్ చేసింది. 


రీసెంట్ గా రామ్ చరణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం లో మంగమ్మత్త పాత్రతో అనసూయ అదరగొట్టేసింది. ఇప్పుడు ఎక్కడికెళ్లినా ఆమెను అదే పేరుతో పిలుస్తున్నారు. ఈ క్యారెక్టర్ కు ఇంత గుర్తింపు లభిస్తుందని అనుకోలేదంటూ అనసూయ కూడా ఆనందపడిపోతోంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa