ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాలార్' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తుంది. ఈ సినిమాలో టాలెంటెడ్ తమిళ నటుడు గోపీ ఆన్‌బోర్డ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై జాన్‌ని ప్రశ్నించగా, 'నేను ఏ రీజినల్ సినిమాలోనూ నటించడం లేదు. ఈ ఊహాగానాలు ఎక్కడ మొదలయ్యాయో నాకు తెలియదు. రీజినల్ సినిమాలో సపోర్టింగ్ రోల్స్ చేయను. నేను బాలీవుడ్ నటుడ్ని 'అని సమాధానం ఇచ్చాడు. దీనితో, జాన్ 'సలార్' సినిమాలో నటించటం లేదు అని కంఫర్మ్ చేసారు. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa