సౌత్ ఇండియాలో 'KGF1' సినిమా ఒక సెన్సేషన్ ని సృష్టించింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ హీరో గా నటించాడు. ఇప్పుడు అందరూ 'KGF2' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీనిధి శెట్టి ఈ సినిమా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది అని మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసి CBFC నుండి U/A సర్టిఫికెట్ పొందింది. రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ మరియు ఇతర ప్రముఖ పాత్రలు పోషించిన ఈ పాన్-ఇండియన్ సినిమా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం అండ్ హిందీ భాషల్లో విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa