ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్లాస్సి లుక్ లో 'జన గణ మన' టీమ్

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 31, 2022, 03:14 PM

సెన్సేషనల్ డైరెక్టర్, పూరి జగన్నాధ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో స్పోర్ట్స్ డ్రామా ట్రాక్ లో వస్తున్న 'లైగర్' సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. వీళ్ళ కాంబినేషన్ లో మరొక సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. పూరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ 'జనగణమన' సినిమాలో విజయ్ దేవరకొండ ఆర్మీ మేన్‌గా కనిపించనున్నాడు. ఈ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా సినిమాని ఛార్మీ కౌర్ అండ్ వంశీ పైడిపల్లి భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. తాజాగా ఛార్మీ కౌర్, పూరీ జగన్నాధ్ అండ్ విజయ్ దేవరకొండ ఢిల్లీకి వెళ్లగా ముగ్గురూ క్లాస్‌ అండ్ ప్రొఫెషనల్‌గా కనిపించారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో ఫుల్ వైరల్ అవుతుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ అండ్  మలయాళంలో విడుదల కానుంది. ఆగస్ట్ 3, 2023న ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చనున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరలో ప్రారంభించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa