టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'RRR' సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమాలో ఆయన నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ 'RC15' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. తమిళ నటుడు ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తుండగా, సునీల్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజా అప్డేట్ ప్రకారం, ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు ఈ షెడ్యూల్ లో శంకర్ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. 2023 సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ చేయాలనీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa