బుల్లితెర యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచియమయ్యారు అనసూయ. ఈ టీవీ లో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ కామెడీ షో ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇప్పుడు రియాల్టీ షోస్ తో పాటు సినిమాల్లోను నటిస్తున్నఆమె ఇటీవల రామ్ చరణ్ నటించిన’రంగస్థలం’ చిత్రంలో రంగమ్మత్తగా నటించి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. తాజాగా అభిమానులతో ముచ్చటించిన అనసూయ ఆసక్తికర విషయాలను వెల్లడించారు .
మళ్ళీ మీరు మిడిల్ ఏజ్ పాత్రల్లో నటిస్తారా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు అనసూయ సమాధానమిచ్చారు. పాత్ర నాకు నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి నేను సిద్ధం మిడిల్ ఏజ్, టీనేజ్, ఓల్డేజ్ అనే షరతులు లేవని అన్నారు. అలాగే రంగమ్మత్త పాత్ర చేస్తున్నప్పుడు ఎలా అనిపించిందని మరో అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ముందు చాలా ఇబ్బంది పడ్డాను కానీ ఒకసారి పాత్ర చేయడానికి అంగీకరిస్తే వెను తిరిగి చూడను. నా భయమంతా సినిమా డబ్బింగ్ చెప్పేటప్పుడే పోయింది అని వివరించిన అనసూయ ప్రస్తుతం 3 సినిమాలను అగీకరించాను వాటికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తా అని అభిమానులకి తెలియజేశారు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa