కన్నడ పవర్ స్టార్, దివంగత పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రంగా జేమ్స్ పేక్షకుల ముందుకు వచ్చింది. పునీత్ జయంతిని పురస్కరించుకుని మార్చి 17న విడుదలైన ఈ సినిమాకు కన్నడ ప్రజలు బ్రహ్మరధం పట్టారు. తమ అభిమాన నటుడిని ఆఖరిసారి సిల్వర్ స్క్రీన్ పై చూడాలన్న తహతహ తో ప్రతి ఒక్క ప్రేక్షకుడు థియేటర్ కు వెళ్లి, పునీత్ యాక్షన్ ను చూసి కంట తడి పెట్టుకున్నారు. ఈ సినిమా విడుదలైన రోజు నుండి ఒక వారం వరకు ధియేటర్లన్నింటిలోనూ కేవలం జేమ్స్ చిత్రాన్నే ప్రదర్శించి పునీత్ పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు కన్నడ థియేటర్ యజమానులు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ఓటిటి ఎంట్రీకి సిద్ధమైంది. ఏప్రిల్ 14వ తేదీ నుండి సోనీ లివ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. తమిళ,కన్నడ,హిందీ,మలయాళ,తెలుగు భాషలలో డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాలో పునీత్ సరసన ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటించగా, టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ విలన్గా నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa