రంజిత్ ఎమ్ తివారి దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న థ్రిల్లర్ డ్రామా సినిమా 'మిషన్ సిండ్రెల్లా' డైరెక్ట్ OTT రిలీజ్ కానుంది అని సమాచారం. డిస్నీ హాట్‌స్టార్ ఈ సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ రైట్స్‌ని సొంతం చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ జోడిగా నటిస్తుంది. ఈ సినిమా తమిళ బ్లాక్ బస్టర్ 'రాట్సాసన్' సినిమా హిందీ రీమేక్. తాజా అప్‌డేట్‌ల ప్రకారం, 'మిషన్ సిండ్రెల్లా' ఏప్రిల్ 29వ తేదీన డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారానికి అందుబాటులోకి రానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa