ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టైగర్ నాగేశ్వరరావు చిత్ర ప్రారంభానికి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్...

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 01, 2022, 08:59 PM

 మాస్ రాజా రవితేజ వంశీ డైరెక్షన్లో నటించనున్న చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'. 1970లలో దేశవ్యాప్తంగా పేరుమోసిన స్టూవర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ సినిమా  రూపొందనుంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది. ఉగాది పండగను పురస్కరించుకుని ఈ మూవీ ప్రీ లుక్ పోస్టర్ ను ఏప్రిల్ 2న, 12. 06గంటలకు విడుదల చేయనున్నట్టు  చిత్రబృందం తెలిపింది.ఈ సినిమాలో రవితేజ సరసన నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ లు ఆడిపాడనున్నారు .తాజాగా ఈ మూవీ నుండి మరొక ఇంటరెస్టింగ్ అప్డేట్ వచ్చింది. అదేంటంటే... ఈ మూవీ షూటింగ్ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా గ్రాండ్ లాంచ్ అవనుందని తెలిపే అధికారిక పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa