టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ది వారియర్. రామ్ కెరీర్లో 19వ చిత్రం ఇది. రామ్ కెరీర్లో తొలిసారిగా పోలీసాఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రం నుండి, తాజాగా ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఏప్రిల్ 2, ఉగాది పండగను పురస్కరించుకుని ఈ మూవీ విడుదల తేదీకి ముహూర్తం నిర్ణయించారు. ఈ మేరకు ఒక పవర్ ప్యాక్డ్ పోస్టర్ ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ని జూలై 14వ తేదీన విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ పోస్టర్ లో పోలీస్ యూనిఫారం ధరించి, నల్ల కళ్ళద్దాలతో, రాయల్ ఎన్ ఫీల్డ్ పై నేరస్థులను పట్టుకోవటానికి బయలుదేరిన రామ్ కనిపిస్తాడు. పోలీసాఫీసర్ గా మంచి ఫిట్ నెస్ తో , చాలా రగ్డ్ గా కనిపిస్తున్న రామ్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై చిట్టూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతిశెట్టి కథానాయికగా నటిస్తుండగా, ఆది పినిశెట్టి విలన్గా నటిస్తున్నారు. తమిళ,తెలుగు భాషలలో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa