'టైగర్ నాగేశ్వరరావు' పోస్టర్ తో రవితేజ నటిస్తున్న ఈ సినిమా రేంజ్ ఏమిటో తేలిపోయింది. రవితేజ ఈ ఏడాది మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ఒకటిగా 'రామారావు ఆన్ డ్యూటీ' త్వరలో విడుదల కానుంది. ఆ తరువాత సినిమాలుగా 'ధమాకా' .. ' రావణాసుర' సెట్స్ పై ఉన్నాయి. ఈ మూడు సినిమాలను ఈ ఏడాదిలోనే థియేటర్లకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే 'టైగర్ నాగేశ్వరరావు' ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. చిరంజీవి ముఖ్య అతిథిగా ఈ రోజునే ఈ సినిమాను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. రాత్రి వేళలో ట్రైన్ వస్తుండగా .. దాని లైటు వెలుగులో 'టైగర్ నాగేశ్వరరావు'గా ధైర్యంగా నడుస్తూ రవితేజ కనిపిస్తున్నాడు. ఫస్టు పోస్టర్ చూస్తుంటేనే ఈ సినిమాలో రవితేజ పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉంటుందనేది అర్థమైపోతుంది. చాలా కాలం క్రితం ఇటు ప్రజలను .. అటు పోలీసులను తిప్పలు పెట్టిన ఓ స్టూవర్టుపురం దొంగ కథ ఇది. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో నుపుర్ సనన్ .. గాయత్రి భరద్వాజ్ తెలుగు తెరకి పరిచయమవుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa