SS రాజమౌళి డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మాగ్నమ్ ఓపస్ 'RRR' సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సషనల్ రికార్డ్స్ ని సృష్టిస్తుంది. ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్ ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లు రాబడుతుంది. తెలుగు స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్‌ల జీవితాల ఆధారంగా తీసిన 'ఆర్ఆర్ఆర్' సినిమా మార్చి 25న విడుదలైంది. కామ్‌స్కోర్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఏప్రిల్ 1 నుండి 3వ వారాంతంలో వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 4 స్థానంలో ఉంది అని సమాచారం. ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా $112 మిలియన్ (850 కోట్లు) వసూలు చేసింది. ఈ యాక్షన్ డ్రామా మూవీలో అలియాభట్,సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa