టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న కొత్త చిత్రం సర్కారువారిపాట. పరశురామ్ డైరెక్షన్లో, యాక్షన్ కామెడి ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, GMB ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. పోతే... ఈ సినిమా షూటింగు చివరి దశకు చేరుకుంది. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి మే 12 న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాని తీసుకొస్తామని ఇంతకుముందే ప్రకటించారు నిర్మాతలు. అయితే తాజాగా వస్తున్న బజ్ ప్రకారం ఈ సినిమా విడుదల వాయిదా పడనుందని తెలుస్తోంది. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నప్పటికీ, మే 12 లోపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యే అవకాశం లేదనీ, అందుకే నిర్మాతలు ఈ సినిమాని మే నెలాఖరుకు విడుదల చేస్తారని తాజా సమాచారం. అయితే విడుదలను వాయిదా వేస్తున్నట్లు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు చిత్రబృందం. దీంతో అనుకున్న రోజునే అంటే మే 12 న ఈ సినిమా విడుదలవుతుందని మహేష్ ఫ్యాన్స్ బల్లగుద్ది చెబుతున్నారు. అయితే సర్కారు వారిపాట చిత్రబృందం ఈ వార్త పై ఎలాంటి స్పందన తెలియచేయకపోవటం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa