తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్ చిత్రం విడుదలకు ముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. సినిమాలో ఆయన సరసన బుట్టబొమ్మ పూజ హెగ్డే నటించింది. ఈ సినిమా నుంచి విడుదలైన అరబిక్ కుతు సాంగ్ యూట్యూబ్‌లో సంచలనాలను సృష్టించింది. 26 కోట్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డులు సాధించింది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.
ఏప్రిల్ 13న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. అయితే విడుదలకు ముందు ఈ సినిమాకు షాక్ తగిలింది. ఉగ్రవాద నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాను తమ దేశంలో విడుదల చేయనివ్వబోమని కువైట్ నిషేధించింది. గల్ఫ్ కంట్రీలో ఓ షాపింగ్ మాల్‌లో తిష్ట వేసిన తీవ్రవాదులను ఓ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ ఎలా అంతమొందించాడనే సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. తమ దేశంలో ఉగ్రవాదులకు చోటు లేదని, అలాంటి నేపథ్యంతో వచ్చిన సినిమాలను విడుదల కానివ్వబోమని కువైట్ ప్రభుత్వం పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa