'భీమ్లా నాయక్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తమిళ హిట్ సినిమా 'వినోదయ సీతం' రీమేక్ చేయడానికి అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడని ఫిలిం ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి. సముద్రకని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ప్రముఖ కెమెరామెన్ రవి కె చంద్రన్ ఈ సినిమాకి కెమెరాను క్రాంక్ చేయనున్నారు. 'భీమ్లా నాయక్' సినిమాలో రవి కె చంద్రన్ చేసిన పనికి పవన్ బాగా ఇంప్రెస్ అయ్యాడని, అందుకే ఈ సినిమాలో ఆయనను మరోసారి తీసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం పవన్ 21 రోజుల కాల్షీట్ ఇచ్చినట్లు సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ZEE5తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa