మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, ఆలా వైకుంఠపురములో వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నివేతా పేతురాజ్ ఇప్పుడు 'బ్లడీ మేరీ' తో OTT ప్లాట్ఫారంలోకి ఎంట్రీ ఇస్తుంది. క్రైమ్ థ్రిల్లర్‌ట్రాక్ లో రానున్న ఈ వెబ్ ఒరిజినల్‌కి చందు మొండేటి దర్శకత్వం వహించారు. తాజాగా ఇప్పుడు ఏప్రిల్ 15, 2022 నుండి ఈ వెబ్ ఒరిజినల్ ఆహా ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. 'బ్లడీ మేరీ' లో బ్రహ్మాజీ, అజయ్, కిరీటి, రాజ్‌కుమార్ కసిరెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ OTT సినిమాకి కాల భైరవ సంగీతం అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తు౮ది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa