పుష్కర్-గాయత్రి దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ యాక్ట్రెస్ రాధికా ఆప్టే ప్రస్తుతం 'విక్రమ్ వేద' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, ఈ గ్లామర్ బ్యూటీ కొత్త సినిమా డైరెక్ట్ OTT రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విశాల్ ఫ్యూరియా దర్శకత్వంలో సైకలాజికల్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో రాధికా ఆప్టే, విక్రాంత్ మాస్సేతో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఈ సినిమాకి 'ఫోరెన్సిక్' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌ని ఎంచుకున్నట్లు సమాచారం. ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ ZEE5 ఈ సినిమా రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. తాజాగా zee5 సోషల్ మీడియాలో ఈ సినిమా త్వరలో ZEE5 ప్లాట్‌ఫారమ్‌లో ప్రీమియర్ చేయబడుతుందని ప్రకటించింది. ఈ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ సినిమాలో ప్రాచీ దేశాయ్, విందు దారా సింగ్ అండ్ రోహిత్ రాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మినీ ఫిల్మ్స్ అండ్ సోహమ్ రాక్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి అద్రిజా గుప్తా సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa