ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెంకట్ ప్రభుతో నాగ చైతన్య సినిమా ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Wed, Apr 06, 2022, 12:48 PM

'బంగార్రాజు' సినిమాతో ఘనవిజయం సాధించిన అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం 'థ్యాంక్యూ' సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ యంగ్ హీరో తన తదుపరి సినిమాని తమిళ దర్శకుడితో ప్రకటించాడు. ఇటీవలే శింబు నటించిన ‘మానడు’ సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు వెంకట్ ప్రభుతో నాగచైతన్య తన 22వ సినిమాని చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్‌ నిర్మాణ సంస్థ శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ నిర్మిస్తోంది. ఈ సినిమాకి మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాతో వెంకట్ ప్రభు తెలుగులోకి అరంగేట్రం చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa