టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ దర్శకుడు ప్రవీణ్ సత్తారుతో కలిసి ఒక సినిమా చేస్తున్నట్లు అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాకి టెంపరరీగా 'VT12' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో వరుణ్ సరసన జోడిగా సాక్షి వైద్యను బోర్డులోకి తీసుకున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని అంచనా వేస్తున్నారు. ఈ యాక్షన్ మూవీ కోసం వరుణ్ తేజ్ దాదాపు 12 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మిక్కీ జై మేయర్ ఈ సినిమాకి సంగీతం అందించనున్నారు. SVCC బ్యానర్‌పై BVSN ప్రసాద్ అండ్ బాపినీడు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు ప్రస్తుతం నాగార్జున అండ్ సోనాల్ చౌహాన్ నటించిన 'ది ఘోస్ట్' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. వరుణ్ తేజ్ తన స్పోర్ట్స్ బేస్డ్ డ్రామా 'ఘనీ' విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa