కేజీఎఫ్ మొదటి పార్ట్ కు మించి కేజీఎఫ్2 సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేశారు చిత్రయూనిట్. కేజీఎఫ్ 2 నుంచి ఎదగర అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అమ్మ ప్రేమకు అద్దం పట్టేలా ఈ పాట సాగింది. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ పాటను సుచేత బస్రూర్ ఆలపించారు.
ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ తో సెకండ్ పార్ట్‌పై భారీ హైప్స్ క్రియేట్ అయ్యాయి. ఆ అంచనాలను మించేలా భారీ బడ్జెట్, స్టార్ క్యాస్టింగ్, హై టెక్నికల్ వేల్యూస్‌తో కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమాను రూపొందించారు మేకర్స్. కేజీఎఫ్ ఛాప్టర్ 2 చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే హోంబలే ఫిలింస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa