ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ - రష్మికలపై క్లాప్ కొట్టిన దిల్ రాజు

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 12:03 AM

తమిళ స్టార్ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే. ఈ సినిమాకి కథానాయికగా రష్మికను ఎంపిక చేసుకున్నట్టు ఇటీవలనే ప్రకటించారు. ఇక ఈ రోజున ఈ సినిమా పూజా కార్యక్రమాలు చెన్నైలో జరిగాయి. విజయ్ - రష్మికలపై దిల్ రాజు క్లాప్ ఇవ్వడంతో ముహూర్తపు షాట్ ను చిత్రీకరించారు. విజయ్ తాజా చిత్రంగా రూపొందిన 'బీస్ట్' ఈ నెల 13వ తేదీన విడుదల కానుంది. ఆ సినిమా థియేటర్లకి రావడానికి వారం రోజుల ముందుగా, వంశీ పైడిపల్లి సినిమా పట్టాలెక్కడం విశేషం. కెరియర్ పరంగా విజయ్ కి ఇది 66వ సినిమా. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నాడు. తెలుగు .. తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 'మహర్షి' తరువాత వంశీ పైడిపల్లి - దిల్ రాజు కాంబినేషన్లో నిర్మితమవుతున్న ఈ సినిమాతో, కోలీవుడ్ లోను రష్మిక జెండా ఎగరేసే అవకాశాలు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa