మరో కొత్త చిత్రం తీయబోతున్న చైతుకు జోడిగా పూజా హెగ్డే నట్టించనున్నదని సమాచారం. ఇదిలావుంటే నాగచైతన్య నుంచి ఇటీవల వచ్చిన 'బంగార్రాజు' భారీ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత సినిమాగా ఆయన నుంచి 'థ్యాంక్యూ' రానుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కథానాయికగా రాశి ఖన్నా అలరించనుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను పలకరించడానికి ముస్తాబవుతోంది. ఈ సినిమా తరువాత చైతూ .. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఒక సినిమా రూపొందించనున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ కాంబినేషన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కెరియర్ పరంగా చైతూకి ఇది 22వ సినిమా. తమిళంలో దర్శకుడిగా వెంకట్ ప్రభుకి మంచి పేరు ఉంది. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా పూజ హెగ్డే పేరు తెరపైకి వచ్చింది. అయితే అధికారికంగా చెప్పవలసి ఉంది. తెలుగులో పూజ హెగ్డే తన ఫస్టు సినిమానే చైతూతో చేసిన సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa