ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబైలో 'KGF 2' ప్రమోషన్స్‌లో యష్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 01:17 PM

సౌత్ ఇండియాలో "KGF1" సినిమా ఒక సెన్సేషన్ ని సృష్టించింది. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించాడు. ఇప్పుడు అందరూ "KGF2" కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీనిధి శెట్టి ఈ సినిమా హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఏప్రిల్ 14, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో ఈ సినిమా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. హిందీలో ప్రమోషన్స్‌లో భాగంగా నవీ ముంబైలోని ఒక మాల్‌కు వెళ్లిన యష్, అక్కడ జనాల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసి షాక్ అయ్యాడు. యష్‌కి ప్రేక్షకుల నుండి ఎలాంటి క్రేజ్ ఉందో రుజువు అవుతుంది. ఈ పాన్-ఇండియా మూవీకి రవి బస్రూర్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa