ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూర్య తదుపరి చిత్రంలో డబల్ రోల్ చేయనున్నారా?

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 01:35 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అండ్ గ్లామర్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటించిన "ఎతర్క్కుం తునింధవన్‌" సినిమా మార్చి 10, 2022న థియేటర్లలో విడుదలైంది. పాండిరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళనాడులో సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. సన్ పిక్చర్స్ ఈ యాక్షన్ థ్రిల్లర్‌ సినిమాని నిర్మించింది. సూర్య, డైరెక్టర్ బాలతో ఒక సీరియస్ డ్రామా చేస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం అధికారకంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ సినిమాలో సూర్య డబల్ రోల్ లో కనిపించనున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేయడం లేదని, దానికి సంబంధించిన వార్తలు ఫేక్ అని తెలిసింది. ఈ చిత్రాన్ని జ్యోతిక, సూర్య అండ్ 2D ఎంటర్‌టైన్‌మెంట్‌పై రాజశేఖర్ పాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa