ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘రామారావు ఆన్ డ్యూటీ’ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 07:17 PM

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఆ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘బుల్ బుల్ తరంగ్’ ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. కొత్త డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు. సామ్ సిఎస్ సంగీతం. జూన్ 17న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుందీ చిత్రం.

రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన కథాకథనాలతో నిర్మితమైన ఈ సినిమాకి, ఆయన కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చాలా కాలం తరువాత వేణు తొట్టెంపూడి ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ కారణంగా ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందన్నది చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa