ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ వెనకడుగు వేశారు. తన తాజా చిత్రం డేంజరస్ విడుదలను ఆయన వాయిదా వేశారు. ఇందుకు గల కారణాన్ని కూడా వివరిస్తూ కాసేపటి క్రితం వర్మ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. డేంజరస్ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తానని ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది.
స్వలింగ సంపర్కం నేపథ్యంలో వర్మ తెరకెక్కించిన ఈ చిత్ర ప్రదర్శనకు పీవీఆర్ సినిమాస్, ఐనాక్స్ సినిమాస్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మరికొన్ని థియేటర్లు కూడా ఈ సినిమా ప్రదర్శనకు ముందుకు రాలేదట. ఈ కారణంగానే చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నట్లు వర్మ ప్రకటించారు. తనకూ, తన చిత్రానికి జరుగుతున్న అన్యాయంపై అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో పోరాటం చేస్తానని చెప్పిన వర్మ.. త్వరలోనే చిత్రం విడుదలకు మరో తేదీని ప్రకటిస్తానని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa