మీకు మీరే ఓ బంగారు నిధి' అంటోంది కోలీవుడ్ బ్యూటీ వేదిక. ఈ ముంబై భామ దక్షిణాదిన అన్ని భాషలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఈ ముద్దుగుమ్మ సొంతం. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలు, వీడియోలు అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. తాజాగా సైడ్ లుక్ లో గోల్డ్ మైన్ లా మెరిసి పోతున్న ఓ పిక్ ను అభిమానులతో పంచుకుంది. విజయదశమి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత బాణం, దగ్గరగా.. దూరంగా, రూలర్ సినిమాల్లో నటించింది. కాంచన 3 లోనూ కనిపించింది. ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వీటిలో 'జింగిల్' ద్విభాషా (తెలుగు, తమిళ్) చిత్రం ఒకటి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa