ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన "పుష్ప: ది రైజ్" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీ మ్యూజిక్ ఆల్బమ్ కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా విజయం తర్వాత పాన్-ఇండియన్ స్టార్‌గా మారారు. ఈరోజు అల్లు అర్జున్ తన 39వ పుట్టినరోజును వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ స్టార్ హీరో తన భార్య, పిల్లలు మరియు కుటుంబసభ్యులతో కలిసి సెర్బియాలో బర్త్ డే ని స్పెషల్ గా జరుపుకుంటున్నారు. బాలీవుడ్ లో కూడా ఈ స్టైలిష్ హీరో ఫుల్ స్టార్‌డమ్‌ను సంపాదించుకున్నాడు. ‘పుష్ప’ పార్ట్ 2 షూటింగ్‌ను మే లేదా జూన్‌లో ప్రారంభించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa