అక్కినేని నట వారసుడిగా వెండితెరకు పరిచయమైన అఖిల్, చాన్నాళ్ల తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. కొత్త సినిమా ఏజెంట్ తో ఆ విజయాన్ని కంటిన్యూ చెయ్యాలని చూస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న చిత్రం ఏజెంట్. AK ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.
ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుండి ఒక స్పెషల్ పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది. సినిమాలో అఖిల్ పాత్ర ఎలా ఉండబోతుందో ఈ పోస్టర్ చూస్తేనే అర్ధమవుతుంది. మజిల్ బాడీతో, సిగరెట్ కాలుస్తూ, యాటిట్యూడ్ తో కూడిన అఖిల్ ఇంటెన్స్ లుక్ యువతను ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు వచ్చిన అఖిల్ చిత్రాలలో ఈ లుక్కే బెస్ట్ అని చెప్పొచ్చు. సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. దేశభక్తి తో కూడిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను ఆగస్టు 12 న విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa