దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు అమితాసక్తితో ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటైన ఆర్ ఆర్ ఆర్ విడుదలై రికార్డు స్థాయి కలెక్షన్లను రాబడుతూ బాక్సాఫీస్ దుమ్ము రేపుతోంది. ఇప్పుడు టైం కేజీఎఫ్ ది. 2018లో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఎంతటి భారీ విజయన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీంతో కేజీఎఫ్ చాప్టర్ 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కరోనా కారణంగా విడుదల ఆలస్యమైన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేయగా, ఈ సినిమా విడుదల కోసం ఎప్పటినుండో కాచుక్కూర్చున్న ఉత్తరాది జనాలు ఎగబడి మరీ టికెట్లను సొంతం చేసుకుంటున్నారట. హిందీ బెల్ట్ లో బుకింగ్స్ ఓపెనైన 12 గంటల్లోనే సుమారు 1.07 లక్షల టికెట్లు అమ్ముడయ్యి, మొత్తం 3.35కోట్ల గ్రాస్ కలెక్ట్ అయిందట. ఈ మొత్తంలో 75లక్షలతో ఢిల్లీ ముందుండగా, 60లక్షలతో ముంబై ఆ తర్వాతి స్థానంలో ఉండటం విశేషం. బుధవారానికల్లా కేవలం హిందీ బెల్ట్ లోనే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 15కోట్లకు పైగా కలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితుల అంచనా.
అయితే ప్రస్తుతానికి ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ను పరిమిత సెంటర్లకే అనుమతి నిచ్చినా, ఆదివారానికల్లా మిగిలిన అన్ని సెంటర్లలో కూడా ఈ మూవీ టికెట్స్ అందుబాటులోకి రానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa