సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అక్కినేని అఖిల్ నటిస్తున్న 'ఏజెంట్' సినిమా నుంచి శుక్రవారం కొత్త పోస్టర్ విడుదలైంది. అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఓ కొత్త పోస్టర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో అఖిల్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఆ పోస్టర్ లో అఖిల్ సిగరెట్ కాలుస్తూ వైల్డ్‌గా కనిపించారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ అందించగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అనిల్ సుంకరకు చెందిన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ రెడ్డికి చెందిన సరెండర్ 2 సినిమా బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa