మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన బాక్సింగ్ డ్రామా 'ఘనీ' ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. అంతకముందు జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో, 'ఘనీ' నిర్మాతలు అల్లు బాబీ అండ్ సిద్ధు ముద్దా ఈ సినిమాని కన్నడలో కూడా ఏప్రిల్ 8, 2022న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కన్నడ వెర్షన్ ప్రమోషన్స్ ని స్టార్ యాక్టర్ ఉపేంద్ర చూసుకుంటారని కూడా వారు వెల్లడించారు. కానీ, ఈ సినిమా కన్నడ వెర్షన్ ఈరోజు విడుదల కాలేదు. ఈ విషయం గురించి మేకర్స్ నుండి ఎటువంటి సమాచారం లేదు. నదియా, జగపతి బాబు, సునీల్ శెట్టి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa