ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేదికపై హాస్యనటుడు క్రిస్ రాక్‌ని చెంపదెబ్బ కొట్టిన స్టార్ హీరో విల్‌స్మిత్‌పై వేటు పడింది. ఆయన ఆస్కార్ వేడుకల్లో పాల్గొనకుండా పదేళ్ల పాటు నిషేధం విధిస్తూ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇటీవల ఆయన గెలుచుకున్న ఆస్కార్ ఉత్తమ నటుడి అవార్డును రద్దు చేయలేదు. నిషేధం విధించిన పదేళ్ల కాలంలో అవార్డులకు ఎంపిక కావడంపై అభ్యంతరాలేమీ పెట్టలేదు. స్మిత్‌పై చర్యల గురించి చర్చించడానికి అకాడమీ గవర్నర్‌లు శుక్రవారం సమావేశం అయ్యారు. ఇందులో బోర్డు సభ్యులు స్టీవెన్ స్పీల్‌బర్గ్, హూపీ గోల్డ్‌బెర్గ్ ఉన్నారు.