నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున 'బీస్ట్' సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారు. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో విజయ్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజాహెగ్డే జంటగా నటిస్తుంది. ఈ చిత్రం ఏప్రిల్ 13, 2022న థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్‌లను ప్రారంభించారు. తాజాగా నిన్న ఈ సినిమా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్, అనిరుధ్ రవిచందర్ అండ్ పూజాహెగ్డే హైదరాబాద్‌లో ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ పాపులర్ అరబిక్ కుతు సాంగ్ కి డాన్స్ చేసారు. ఈ డాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్‌లో ఫుల్ వైరల్ అవుతుంది కానీ కొంతమంది అభిమానులు తలపతి విజయ్‌ని మిస్ అవుతున్నారని వ్యాఖ్యానించారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa