వేణు శ్రీరామ్ దర్శకత్వంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' 2021 ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదలై ఇప్పుడు 1 సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది. ఈ రీమేక్‌లో కొణిదెల సత్య దేవ్ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించాడు. 'వకీల్ సాబ్' 2016 హిందీ జాతీయ అవార్డు గెలుచుకున్న 'పింక్' సినిమాకి రీమేక్. పవన్ కళ్యాణ్ అభిమానులు ట్విట్టర్‌లో '1ఇయర్స్ఆఫ్ బిబివకీల్‌సాబ్' ట్రెండ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ప్రకాష్ రాజ్ అండ్ శృతి హాసన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ హిట్ సినిమాని బేవ్యూ ప్రాజెక్ట్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై దిల్ రాజు అండ్ శిరీష్ నిర్మించారు. పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమా 137 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన మూడవ తెలుగు సినిమాగా పవర్ స్టార్ 'వకీల్ సాబ్' సినిమా నిలిచింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డైరెక్టర్ క్రిష్‌తో 'హరి హర వీర మల్లు' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa