రవితేజ హీరోగా కొత్త దర్శకుడు శరత్ మండవతో సాలిడ్ మాస్ అండ్ సోషల్ డ్రామా రామారావు ఆన్ డ్యూటీ”. ఈ రోజు రామ నవమి సందర్భంగా ఈ చిత్రం నుండి మొదటి సింగిల్ 'బుల్ బుల్ తరంగ్'ని విడుదల చేసారు. అయితే మొదటి సారి వినగానే ఆకట్టుకుంది. సిద్ శ్రీరామ్ వాయిస్ అలాగే విజువల్‌గా ఈ పాట చాలా క్యూట్‌గా మరియు కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. అలాగే హీరోయిన్, రవితేజ లుక్ కూడా బాగుంది. ముఖ్యంగా సామ్ సిఎస్ నుండి వచ్చిన మొదటి పాట ఈ సినిమా నుండి మంచి హిట్ ట్రాక్ ని అందించిందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ సినిమా టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. జూన్ 17న ఈ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa