మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో గతంలో ఎన్నడూ లేని విధంగా జోరులో మీద ఉన్నాడు. ఆయన చేతిలో ప్రస్తుతం 5 సినిమాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఈ సినిమాలో ఆయన తనయుడు రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటించడంతో విడుదలకు ముందే దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్12న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అంతేకాకుండా సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏప్రిల్ 24న యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు వచ్చే అతిథులకు సంబంధించి లిస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వేడుకకు ముఖ్యఅతిథులుగా పవన్ కళ్యాణ్, కేటీఆర్ రానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై సినిమా బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్, రామ్‌చరణ్ సరసన పూజా హెగ్డే నటించారు. మణిశర్మ అద్భుతమైన బాణీలు సమకూర్చారు.