ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుల్కర్ సల్మాన్ తెలుగు సినిమాకి టైటిల్ లాక్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 11, 2022, 12:53 PM

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ సినిమాలను తీయటంలో పేరుగాంచిన దర్శకుడు హను రాఘవపూడి ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తో సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మృణాళిని ఠాకూర్ లేడీ లవ్ కనిపించనుంది. తాజాగా ఈ మూవీలో కన్నడ బ్యూటీ  రష్మిక మందన్న కూడా కనిపించనుంది అని మేకర్స్ ప్రకటించారు. అఫ్రీన్ అనే కాశ్మీరీ ముస్లిం యువతి పాత్రలో రష్మిక కనిపించనుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ‘సీతా రామం’ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు మూవీ టీమ్ వీడియో గ్లింప్‌స్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్అండ్ ప్రియాంక దత్ ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాను నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa