ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'KGF 2' చేయమని తనే నన్ను బలవంతం చేసింది-సంజయ్ దత్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 11, 2022, 01:00 PM

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాకింగ్ స్టార్ యష్ నటించిన 'KGF-2' ఏప్రిల్ 14, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో యాష్ సరసన జోడిగా శ్రీనిధి శెట్టి నటిస్తుంది. ప్రకాష్ రాజ్, సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇండియా వైడ్ గా ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో సంజయ్ దత్ మాట్లాడుతూ..... తనకు ఈ సినిమాపై అంత ఆసక్తి లేదని, అయితే అతని భార్య మాన్యత తనను ఈ సినిమా చేయమని బలవంతం చేసిందని చెప్పాడు. అలాగే స్క్రిప్ట్ వినమని తన భార్య బలవంతం చేయడంతో విన్నాను అని, విన్న తర్వాత తను ఆ పాత్రను ఇష్టపడ్డానని చెప్పాడు. అయితే ఇప్పుడు సినిమా వచ్చిన తీరు చూస్తుంటే తన కెరీర్‌లోనే చేసిన బెస్ట్ రోల్స్‌లో ఇదొకటి అని సంజయ్ దత్ అంటున్నాడు. హోంబలే ఫిలింస్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ పాన్-ఇండియా చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa