విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో గ్లామర్ బ్యూటీ సమంత 'కాతు వాకుల రెండు కాదల్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార అండ్ విజయ్ సేతుపతి కూడా ప్రధాన పత్రాలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రొమోషన్స్ ని స్టార్ట్ చేసారు. ఈ సినిమాలోని 'టూ టూ టూ' పాట కొత్త వీడియో క్లిప్‌లను త్వరలో విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని సమంత కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇంతకుముందు, మేకర్స్ డిస్నీ హాట్ స్టార్ ఈ సినిమా రైట్స్ ని భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు ఈ సినిమా OTT విడుదల అవుతుందని వార్తలు వినిపించాయి. ఏప్రిల్ 28న ఈ సినిమా పలు భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. విఘ్నేష్ శివన్‌ల రౌడీ పిక్చర్స్ అండ్ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa