ఆచార్య సినిమా నుంచి మరో కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. ఆ పోస్టర్ అందర్నీ ఆకట్టుకొనేలా ఉండటం మెగా ఫ్యాన్స్ కు సంతోషంలో ముంచెత్తుతోంది. చిరంజీవి 'ఆచార్య' సినిమా ఈ నెల 29వ తేదీన విడుదల కానుంది. ఈ నెల 13వ తేదీన 'బీస్ట్' .. 14వ తేదీన 'కేజీఎఫ్ 2' సినిమాలు భారీ స్థాయిలో విడుదల కానున్నాయి. అందువలన ఆ తరువాత నుంచి 'ఆచార్య' సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ లోగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పారు.
ఈ నెల 12వ తేదీన ట్రైలర్ ను విడుదల చేయనున్నట్టు చెప్పారు. మరోసారి అదే విషయాన్ని గుర్తుచేస్తూ, చిరంజీవి - చరణ్ కాంబినేషన్లోని ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ మెగా అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. కొరటాల దర్శకత్వం వహించిన ఈ సినిమాను నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందించారు. ఇంతవరకూ వదిలిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చిరూ సరసన కాజల్ .. చరణ్ జోడీగా పూజ హెగ్డే సందడి చేయనున్న ఈ సినిమాలో, రెజీనా స్పెషల్ సాంగులో మెరవనుంది. ముఖ్యమైన పాత్రల్లో సోనూ సూద్ .. సంగీత .. అనసూయ కనిపించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa