మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని సినిమాను తీయగా అది ఆశించినస్థాయిని అందుకోలేకపోయింది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా సినీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ తరుణంలో వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ నోట్ ను షేర్ చేశారు. 'గని' సినిమాను ఎంతో ఫ్యాషన్ తో చేశామని, అది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలేకపోయిందని అన్నారు. ఈ సినిమా రిజల్ట్ ను తీసుకుని రాబోవు రోజుల్లో మరింత ముందుకు సాగుతానని తెలిపారు. గని సినిమాపై వరుణ్ గట్టిగానే ఆశలు పెట్టుకోగా అవి ఫలించకపోవడం వలన, ఆయన తన ఎమోషన్స్ ను పంచుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa