పరశురామ్ డైరెక్షన్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. కీర్తిసురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లస్, GMB ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అవుటండవుట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా రానున్న ఈ చిత్ర షూటింగు ఒక్క పాట మినహా దాదాపు కంప్లీట్ అయిపొయింది. ఆ పాట కూడా తొందర్లోనే పూర్తి కానుంది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుంటున్న ఈ సినిమాను మే 12న విడుదల చేయటానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ దశ నుండి ఈ మూవీ నుండి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ప్రేక్షకుల్లో మంచి బజ్ తీసుకొచ్చింది చిత్రబృందం. అలానే.. ఈ సినిమా నుండి విడుదలైన రెండు లిరికల్ పాటలు కూడా శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు నమోదయ్యాయి.
మొదటగా విడుదలైన కళావతి పాట మెలోడీ లవర్స్ ను ఆకర్షిస్తే, ఆ తర్వాత విడుదలైన పెన్నీ సాంగ్ అందరినీ అలరించింది. ముఖ్యంగా సితార పాప స్టెప్పులు పెన్నీ సాంగ్ కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి మ్యాజిక్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa